సంక్రాంతి పేరు చెబితే గోదారి జిల్లాల్లో ముందుగా గుర్తుకు వచ్చేది కోళ్ల పందాలే. జాతరలా జరిగే కోడి పందేలను తిలకించేందుకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం సంక్రాంతి పండుగకు రెక్కలు కట్టుకుని స్వగ్రామాల్లో వాలిపోతారు. ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. అటు భీమవరం ఎంత ప్రత్యేకమో ఇటు కోనసీమలోని పలు కేంద్రాలు అంతే ప్రత్యేకం.

కోనసీమ, డిసెంబరు 13(శ్రీ విష్ణు న్యూస్): సంక్రాంతి పేరు చెబితే గోదారి జిల్లాల్లో ముందుగా గుర్తుకు వచ్చేది కోళ్ల పందాలే. జాతరలా జరిగే కోడి పందేలను తిలకించేందుకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం సంక్రాంతి పండుగకు రెక్కలు కట్టుకుని స్వగ్రామాల్లో వాలిపోతారు. ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. అటు భీమవరం ఎంత ప్రత్యేకమో ఇటు కోనసీమలోని పలు కేంద్రాలు అంతే ప్రత్యేకం.

సినిమా యాక్టర్లు సైతం..
కోడి పందేలను తిలకించేందుకు రాజకీయ ప్రముఖులే కాదు సినిమా యాక్టర్లు సైతం పోటీ పడుతుంటారు. సినిమా నటులు అయితే పందెం కోళ్లను పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు యాంకర్లు సైతం కోడిపందేల బరుల వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు.

కోళ్లు ప్రత్యేకమే.. మేత మరింత ప్రత్యేకం..
కోడి పందేలు అంటే ఆషామాషీ కాదు. కోడులందు పందెం కోళ్ల రకాలు వేరయా.. అన్నట్టు పలు రకాల జాతులు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో క్రాస్ బ్రీడ్ లు కూడా పెరిగిపోయాయి. పందెం కోళ్లల్లో కాకి, నెమలి, డేగ, సింగం, సేతువా, అబ్రాస్, పచ్చకాకి, సవల, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిని పందెం పెంపకం దారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి పెంపకం ప్రారంభిస్తారు. కోళ్ల పెంపకం కేంద్రాలు ఎక్కువగా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కోనసీమలోనూ కోళ్ల పెంపకం కేంద్రాలు పెరిగాయి. వాటికి తోడు ఆన్ లైన్ అమ్మకాలు కూడా చేపట్టారు. పందెం కోళ్లకు వేట పోతు మాంసంతో పాటు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు వంటి కాస్ట్లీ మేత పెడుతూ నువ్వా నేనా అన్నట్టు పందెం కోళ్లను పెంచుతున్నట్టు రంగాపురానికి చెందిన బుజ్జి తెలిపారు. పెంపకం అనంతరం ఒక్కో పందెం కోడిని రకాన్ని బట్టి రూ.75 వేలు నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. పందెం కోళ్ల ధరలు ఎక్కువగా ఉండడంతో కోళ్ల దొంగతనాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజులే ఉంది. అప్పుడే పందెం కొట్టే పందెపు పుంజుల కోసం పందెపు రాయుళ్ళు ఆయా పెంపక కేంద్రాలకు తరలివస్తున్నారు.
