ప్రపంచంలోనే అతి చిన్న డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ ను అమలాపురం పట్టణానికి చెందిన మినియేచర్ వరల్డ్ రికార్డు హోల్డర్ తాళాబత్తుల బ్రహ్మాజీ మరో అరుదైన రికార్డు కోసం తయారు చేశారు. అతి చిన్న డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ బరువు కేవలం 20 గ్రాములు మాత్రమే. దాని ఎత్తు 4 సెంటీమీటర్లు కాగా వెడల్పు 2 సెంటీమీటర్లు.

కోనసీమ, నవంబరు 29(శ్రీ విష్ణు న్యూస్): ప్రపంచంలోనే అతి చిన్న డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ ను అమలాపురం పట్టణానికి చెందిన మినియేచర్ వరల్డ్ రికార్డు హోల్డర్ తాళాబత్తుల బ్రహ్మాజీ మరో అరుదైన రికార్డు కోసం తయారు చేశారు. అతి చిన్న డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ బరువు కేవలం 20 గ్రాములు మాత్రమే. దాని ఎత్తు 4 సెంటీమీటర్లు కాగా వెడల్పు 2 సెంటీమీటర్లు. కేవలం పది రోజుల వ్యవధిలో డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ ను ఆయన తయారు చేశారు. ఇప్పటి వరకూ ఈయన 36 సూక్ష్మ వస్తువులను తయారు చేయగా పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. చాలా కాలం తరువాత మరో సూక్ష్మమైన సూక్ష్మాతి ప్రెషర్ కుక్కర్ ను తయారు చేశారు.
డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ పేటెంట్ ఆయనదే..
భారత దేశంలో ఇంతవరకూ డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ తయారు చేయలేదు. కానీ హర్యానాకు చెందిన సుక్ జి మాన్యుఫాక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అయిన సుక్ బీర్ సింగ్ బచ్చన్ దేశంలో డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ తయారీకి ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. సూక్ష్మ వస్తువుల తయారీలో నిపుణుడైన అమలాపురానికి చెందిన బ్రహ్మాజీని ఆయన ఆన్ లైన్లో సంప్రదించారు. సుక్ బీర్ సింగ్ సూచనల మేరకు బ్రహ్మాజీ సూక్ష్మమైన డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ ను తయారు చేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

వెండితో తయారు చేశా – తాళాబత్తుల బ్రహ్మాజీ, అమలాపురం.
డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ ను పూర్తిగా వెండితో తయారు చేశాను. ఇందుకోసం రెండు రబ్బర్ గ్యాస్ కట్లు వినియోగించా. పూర్తి వర్కింగ్ మోడల్ గా తయారు చేసిన ఆ ప్రెషర్ కుక్కర్ ను బొటనవేలుపై నిలిపారు. సూక్ష్మమైన శివాలయం, సీలింగ్ ఫ్యాన్, ప్రెషర్ కుక్కర్ వంటి ఎన్నో వస్తువులను గతంలో తయారు చేశాను. సూక్ష్మ వస్తువుల తయారీలో భాగంగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నా. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
Read Latest AP News And Telugu News
