HomeAndhra Pradeshసమస్యల పరిష్కారానికై.. ఫ్యాప్టో పోరుబాట: ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్

సమస్యల పరిష్కారానికై.. ఫ్యాప్టో పోరుబాట: ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్

, Publish Date -
సమస్యల పరిష్కారానికై.. ఈ నెల 7న విజయవాడలో ఫ్యాప్టో పోరుబాట.. ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ | To solve the problems.. FAPTO Porubata in Vijayawada on the 7th of this month.. FAPTO State Chairman Lankalapalli Sai Srinivas

కోనసీమ, అక్టోబరు 2(శ్రీ విష్ణు న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల విడుదలపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న విజయవాడలో ప్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట నిరసన కార్యక్రమం చేపట్టినట్టు రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం పిలుపు మేరకు చేపట్టిన మహాధర్నాలో భాగంగా సన్నాహక సమావేశము గురువారం ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీఏఎస్ సుబ్బారావు అధ్యక్షతన అమలాపురం ఎస్టీయూ విద్యాభవన్లో నిర్వహించారు. సమావేశానికి ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులకు ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు ఆహ్వానం పలికారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు లంకలపల్లి సాయిశ్రీనివాస్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా విద్యా పరమైన, ఆర్ధిక పరమైన సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం తదితర అంశాలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తంచేసారు. సమావేశంలో ఫ్యాప్టో సంఘ సభ్యులు మోకా ప్రకాష్, రాయుడు ఉదయభాస్కర్, నాగిరెడ్డి శివప్రసాద్, పెంకే వెంకటేశ్వరరావు, సరిదే సత్య పల్లంరాజు, షబ్బీర్ హుస్సేన్, గుత్తాల వెంకటేశ్వరరావు, బొంతు వీవీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోరుబాటను విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.