అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ లూజు అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ లూజు అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయా. లూజు పెట్రోల్ కోసం ఎన్నో ఇళ్ల వద్ద వాహనదారులు ఆగుతుండడం నిజం కాదా. అవి పెట్రోల్ లూజు అమ్మకాల బాటిల్స్ కాకపోతే మరేమిటి అని ఎవరికైనా సందేహం వస్తుంది. పెట్రోల్ లూజు అమ్మకాలు మాదిరిగానే ఇళ్ల ప్రహరీ గోడల పైన – కిటికీలకు వేలాడుతున్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

కోనసీమ, నవంబరు 28(శ్రీ విష్ణు న్యూస్): అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ లూజు అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ లూజు అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయా. లూజు పెట్రోల్ కోసం ఎన్నో ఇళ్ల వద్ద వాహనదారులు ఆగుతుండడం నిజం కాదా. అవి పెట్రోల్ లూజు అమ్మకాల బాటిల్స్ కాకపోతే మరేమిటి అని ఎవరికైనా సందేహం వస్తుంది. పెట్రోల్ లూజు అమ్మకాలు మాదిరిగానే ఇళ్ల ప్రహరీ గోడల పైన – కిటికీలకు వేలాడుతున్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. వీధి కుక్కల బెడద నుంచి బయట పడేందుకు ఇళ్ల యజమానులు, దుకాణాల నిర్వాహకులు ఈ తరహాలో ఎరుపు రంగు కలిపిన నీళ్ల బాటిల్స్ వేలాడ దీస్తున్నారంటే జిల్లాలో కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో అమలాపురం పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల వద్ద, షాపుల ముందు ఎరుపు రంగు బాటిల్స్ రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి.

దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించుకున్నా..
దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో వీధి కుక్కల బెడద ఒకటి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించుకుని మరీ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సమయంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు ప్రభుత్వ పరంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. కానీ ఈ పనులు మందకొడిగానే జరుగుతున్నాయి. ఎందుకంటే వీటిని పట్టుకునేందుకు నిపుణులు అయిన వారిని ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకువస్తున్నారు. ఇక్కడ పట్టుకుంటుంటే అక్కడకు పారిపోవడం వాటి సహజ లక్షణం. ఇదిలా ఉండగా రేబిస్ సోకిన కుక్కలతో పాటు దాడులకు తెగబడే కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు నిర్మించి అక్కడకు తరలించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు శూన్యం.
పట్టణాలు సరే గ్రామాల్లో కుక్కల మాటేమిటి..
వీధి కుక్కల నియంత్రణ పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మరి వాటిని గ్రామాల్లో నియంత్రించేది ఎవరు. అందుకేనేమో కుక్కల బెడద నుంచి బయట పడేందుకు ఎరుపు రంగు వాటర్ బాటిల్స్ వేలాడదీయడం పల్లె సీమల నుంచే ప్రారంభం అయ్యింది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత కుక్కల బెడద తప్పిందని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
కుక్కలకు ఎరుపు రంగు ఫోబియా – డాక్టర్ ఎల్ విజయారెడ్డి, పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుడు, అమలాపురం.
ఎరుపు రంగు కలిపిన వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు అంటే కుక్కలకు ఫోబియా ఉండొచ్చు ఎందుకంటే మరి ఏ ఇతర రంగులు కలిపిన బాటిల్స్ ఎవరూ వేలాడదీయడం లేదు. ఇది మూఢ నమ్మకమని కొట్టి పారేయలేము. ఎరుపు రంగు బాటిల్స్ చూసి కుక్కలు దరిదాపులకు రావడం లేదని చెబుతున్నారు.
Read Latest AP News And Telugu News
