ఒక్క నిమిషం ముందు పుట్టి ఉంటే మీ అబ్బాయి జాతకం అదిరిపోయేది.. ఒక్క గంట ఆలస్యంగా పుట్టి ఉంటే మీ అమ్మాయి మంత్రి పదవి చేసేది.. ఇలా నిమిషాలు గంటల గురించి చెప్పే పంచాంగకర్తలే లెక్కలు తప్పితే ఎలా.

కోనసీమ, డిసెంబరు 7(శ్రీ విష్ణు న్యూస్): ఒక్క నిమిషం ముందు పుట్టి ఉంటే మీ అబ్బాయి జాతకం అదిరిపోయేది.. ఒక్క గంట ఆలస్యంగా పుట్టి ఉంటే మీ అమ్మాయి మంత్రి పదవి చేసేది.. ఇలా నిమిషాలు గంటల గురించి చెప్పే పంచాంగకర్తలే లెక్కలు తప్పితే ఎలా. నిమిషాలు తేడా వస్తేనే నక్షత్రాలు, రాశులు మారిపోతాయని చెప్పేది వారే. బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు లేని లెక్కలు భూమ్మీద పడగానే ఎందుకు వేస్తారు అని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఆకాశంలో గ్రహాల కదలికలు యధావిధిగా ఉండగా పంచాంగకర్తలు సంక్రాంతి పండుగ విషయంలో ఎలా లెక్క తప్పారో మరి.

నెల రోజుల పండుగ సంక్రాంతి..
సంక్రాంతి అంటే నెల రోజుల పండుగ. పండుగ నెల ప్రారంభం అయ్యిందంటే చాలు ప్రతి ఇల్లూ రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతుంటాయి. 2026లో జరిగే సంక్రాంతి పండుగలో భాగంగా ఈ డిసెంబరు నెల 16వ తేదీన నెల పట్టనున్నారు. నెల పట్టడానికి మాత్రం పంచాంగకర్తలు లెక్క తప్పలేదు. 2026 జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగలు జరుపుకోవాలని దృక్ సిద్ధాంతులు చెబుతుంటే.. కాదు కాదు 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతులు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి పండుగ విషయంలో రెండు వర్గాల పంచాంగకర్తలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రోడ్డెక్కారు. మేము చెప్పేదే వేదమని పూర్వ సిద్ధాంతులు చెబుతుంటే, శాస్త్రీయంగా మా లెక్కలే కరెక్ట్ అని దృక్ సిద్ధాంతులు చెబుతున్నారు.
4 ఏళ్లకు ఓ సారి లెక్క తప్పుతున్నారు..
ప్రతీ నాలుగేళ్లకు ఓ సారి పంచాంగ కర్తలు లెక్కలు తప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. సూర్య సంచారం ఆధారంగానే ఇరు పంచాంగ కర్తలు లెక్కలు కడుతున్నారు. అయినా సంక్రాంతి పండుగ లెక్కలు మాత్రం తిప్పుతున్నారు. జనవరి 13న భోగి అని ఒకరు.. కాదు కాదు 14న మరొకరు అంటుంటే ప్రజల్లో ఇప్పటి నుంచి అయోమయం మొదలయ్యింది.
Read Latest AP News And Telugu News
