HomeAndhra Pradesh108 రూపాయల నాణెం ఎప్పుడైనా చూశారా? చరిత్రలో ఇదే మొదటిసారి

108 రూపాయల నాణెం ఎప్పుడైనా చూశారా? చరిత్రలో ఇదే మొదటిసారి

, Publish Date -

భారత ప్రభుత్వం శ్రీ సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతి సందర్భంగా రూ. 108 విలువ గల వెండి నాణెం విడుదల చేసింది. ఇది 40 గ్రాముల తూకంతో, 99.9 శాతం శుద్ధమైన వెండితో తయారయ్యింది.

108 rupee coin
108 rupee coin

కోనసీమ, డిసెంబరు 13(శ్రీ విష్ణు న్యూస్): భారత ప్రభుత్వం శ్రీ సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతి సందర్భంగా రూ. 108 విలువ గల వెండి నాణెం విడుదల చేసింది. ఇది 40 గ్రాముల తూకంతో, 99.9 శాతం శుద్ధమైన వెండితో తయారయ్యింది.

భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఒక అరుదైన నాణెం భారత ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీ సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకొని, తొలిసారిగా రూ. 108 విలువ గల ప్రత్యేక నాణెం తీసుకొచ్చింది. శ్రీ ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతిగా సేవ చేసిన శ్రీ సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతి సందర్భంగా ఈ వెండి నాణెం విడుదల చేసింది. ఇది భారత గణతంత్ర చరిత్రలో తొలి రూ. 108 ముఖ విలువ గల నాణెం.

సత్య ప్రమోద తీర్థ స్వామీజీ ద్వైత వేదాంత సంప్రదాయంలో గౌరవనీయమైన సంస్థ అయిన శ్రీ ఉత్తరాది మఠం యొక్క 41వ పీఠాధిపతి. ఆయన లోతైన పాండిత్యం, మధ్వ తత్వశాస్త్రం పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు.

ఈ ప్రత్యేక స్మారక నాణేన్ని డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణకామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్ పై హైదరాబాద్ టంకశాల నుంచి తెప్పించారు.