పచ్చని కోనసీమ అందాల నడుమ.. పవిత్ర గోదావరీ నదీ తీరాన అయినవిల్లి దివ్య క్షేత్రంలో సిద్ధి వినాయకుడు స్వయంభూవై వెలిశారు. పురాణ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుని నారికేళం, గరిక సమర్పిస్తే చాలు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరతాయని ఎంతో నమ్మకం.

పచ్చని కోనసీమ అందాల నడుమ.. పవిత్ర గోదావరీ నదీ తీరాన అయినవిల్లి దివ్య క్షేత్రంలో సిద్ధి వినాయకుడు స్వయంభూవై వెలిశారు. పురాణ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుని నారికేళం, గరిక సమర్పిస్తే చాలు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరతాయని ఎంతో నమ్మకం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తుంటారు. వ్యాస భగవానుడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు మరో పురాణ కథనం. దక్షిణాభిముఖంగా కొలువై ఉన్న వినాయకుని దర్శనంతో సకల విఘ్నాలు తొలగి సిద్ధి బుద్ధితో పాటు ఐశ్వర్యాన్ని కలిగిస్తారని ఎంతో నమ్మకం.
ఈ పవిత్ర క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. గణపతి ఆలయ ప్రాంగణంలోనే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు, మేనమామ కేశవస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనం ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు. కాకినాడ నుంచీ అయినవిల్లికి 72 కిలోమీటర్లు కాగా, రాజమహేంద్రవరం నుంచి 55 కిలోమీటర్లు, అమలాపురం నుంచి అయినవిల్లికి 14 కిలోమీటర్లు దూరం. తొలిపూజ అందుకునే గణపతికి ఇక్కడ జరిపే పెన్నుల పూజకు ప్రత్యేక స్థానం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం..
Read Latest Devotional News and Telugu News
