
కోనసీమ, అక్టోబరు 1(శ్రీ విష్ణు న్యూస్): ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అమలాపురం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. అమలాపురం గాంధీ బొమ్మ సెంటర్(గడియార స్తంభం) లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రక్త పరీక్షలు, బిపి, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలను పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా నిర్వహించారు. రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలను పట్టణ సిఐ పి. వీరబాబు చేతులు మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిఐ వీరబాబు మాట్లాడుతూ సమాజంలో జరుగుచున్న సైబర్ నేరాలపై వయో వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ముమ్మిడివరం గేటు మీదుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తొలుత ర్యాలీని సీఐ వీరబాబు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు, ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం, కార్యదర్శి నూలు సూర్య ప్రభాకర రావు, కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు తదితర సభ్యులు పాల్గొన్నారు.
