
కోనసీమ, అక్టోబరు 2(శ్రీ విష్ణు న్యూస్): విజయదశమిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా దుర్గాదేవికి తొలుత పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులు, ఇతర ఆయుధాలు, వాహనాలకు ప్రముఖ పంచాంగకర్త ఉపద్రష్ట నాగాదిత్యన్ సోదరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను జిల్లా ఎస్పీ మీనా నిర్వహించారు. పూజల అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని పూజల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. విజయాలకు చిహ్నమైన విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మీనా ఆకాంక్షించారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, అమలాపురం పట్టణ సీఐ పి. వీరబాబు, రూరల్ సీఐ సంపత్ కుమార్, సిసిఎస్ సీఐ జి. గజేంద్ర కుమార్, ఎస్బి సీఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు. విజయదశమి దసరా ఊరేగింపులో భాగంగా విధి నిర్వహణలో ఉన్న పలువురు పోలీసులు కత్తిసాము, కర్రసాము వంటి విన్యాసాలతో తమ ప్రతిభను చాటగా పలువురు అభినందించారు.
