HomeAndhra Pradeshత్రిరత్న బుద్ధ విహార్ లో అశోక విజయదశమి పూజలు..

త్రిరత్న బుద్ధ విహార్ లో అశోక విజయదశమి పూజలు..

, Publish Date -
అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్ లో అశోక విజయదశమి పూజలు.. | Ashoka Vijayadashami pujas at Amalapuram Triratna Buddha Vihar..

కోనసీమ, అక్టోబరు 2(శ్రీ విష్ణు న్యూస్): అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్ లో గురువారం అశోక విజయ దశమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారత బుద్ధ శాసన వర్ధన కీర్తిశ్రీ, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రిరత్న బుద్ధ విహార్ చైర్మన్ నాగాబత్తుల ప్రసాదరావు, సెక్రటరీ జనరల్ డీబీలోక్, బీఎస్ఐ జిల్లా అధ్యక్షులు రామ్ బోధి కాశి, జిల్లా ప్రధాన కార్యదర్శి ములపర్తి సత్యనారాయణ, కోడూరి రామూర్తి, దోనిపాటి నాగేశ్వరరావు, జోగి అర్జునరావు, చిలకపాటి సాంబశివరావు, జల్లి రంగారావు, గోసంగి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. బుద్ధ విహార్ లో జరిగిన కార్యక్రమంలో గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ విజయదశమి పండుగ అశోక చక్రవర్తి పేరిట ఎలా వచ్చిందో వివరించారు. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి వివరించేలా చేసిన ప్రతి అంశం చారిత్రాత్మకంగా కూడా రుజువు అవుతుందన్నారు. అందరికీ ఆయన అశోక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.