HomeAndhra Pradeshవారాహీ దేవిగా దర్శనం..

వారాహీ దేవిగా దర్శనం..

, Publish Date -
ఈదరపల్లి వంతెన వద్ద నున్న శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని శుక్రవారం వారాహీ దేవిగా విశేష అలంకారం చేయించారు.. | The Goddess Durga Bhavani at the Idarapalli Bridge was specially decorated as Goddess Varahi on Friday..

కోనసీమ, అక్టోబరు 3(శ్రీ విష్ణు న్యూస్): దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈదరపల్లి వంతెన వద్ద నున్న శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని శుక్రవారం వారాహీ దేవిగా విశేష అలంకారం చేయించారు. అమలాపురం శ్రీదేవి మార్కెట్ సెంటర్ లోని శ్రీదేవి అమ్మవారు భక్తులకు శ్రీ మంగళగౌరీ దేవిగా దర్శనం ఇచ్చారు. ఆయా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరి అమ్మవార్లను దర్శించుకున్నారు. జిల్లాలోని దుర్గమ్మ ఆలయాల వద్ద అఖండ అన్న సమారాధనలు నిర్వహించారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కళ్యాణ దుర్గమ్మ ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చింతలపాటి శ్రీనివాసరాజు – ప్రసన్న దంపతులు, పీవీ నరసింహరాజు, ర్యాలి వెంకట్రావు, బుజ్జి సోదరులు, పొత్తూరి సత్యనారాయణ రాజు(రాజన్ రాజు) – వరలక్ష్మి దంపతులు అఖండ అన్న సమారాధనకు దాతృత్వం చాటు కున్నారు.