HomeTelanganaనేతలంటే మేతగాళ్లు కాదోయ్..

నేతలంటే మేతగాళ్లు కాదోయ్..

, Publish Date -
కంటి ప‌రీక్ష‌ల కోసం.. క్యూ లైన్‌లో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. | Yellandu former MLA Gummadi Narsaiah in the queue for eye tests..

ఖమ్మం, అక్టోబరు 14(శ్రీ విష్ణు న్యూస్): ఒక్కసారి చిన్న పదవి వస్తే చాలు.. కళ్లు నెత్తి మీదకు వెళ్ళిపోతున్న నేతలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. చిన్న పదవిని అడ్డు పెట్టుకుని లక్షలు సంపాదించే నాయకులు ఎందరో ఉన్న రోజులివి. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు అయితే చెప్పనవసరం లేదు. అందుకే నేతలంటే మేతగాళ్ళు.. అనే నానుడి వచ్చేసింది. నేతలంటే మేతగాళ్ళు కాదోయ్ అని చెప్పే నీతివంతమైన నాయకులు ఒకరో ఇద్దరో మనకు అప్పుడప్పుడు దర్శనం ఇస్తున్నారు.

కంటి ప‌రీక్ష‌ల కోసం.. క్యూ లైన్‌లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఎక్కడికైనా సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వ సాధారణం..

ఈ క్ర‌మంలోనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం ఆయన వచ్చారు. అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. వార్డు మెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.. ఇటువంటి నేతలు కోసం ఎదురు చూడాల్సిందే..