HomeAndhra Pradeshఇంట్లోనే అమ్మకు ఆలయం..

ఇంట్లోనే అమ్మకు ఆలయం..

, Publish Date -
A temple for mother at home

కోనసీమ, నవంబరు 16(శ్రీ విష్ణు న్యూస్): కని – పెంచే పెద్ద చేయడంతో పాటు ప్రయోజకునిగా తీర్చిదిద్దడానికి జీవితాంతం శ్రమించిన అమ్మకు ఓ బిడ్డ ఇంట్లోనే ఆలయం నిర్మించాడు. ఇది ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ చింతా శ్యామ్ జాదూగర్ ఇంట్లోనే జరిగింది.

కట్టు బట్టలతో గ్రామానికి వచ్చాం..

ర్యాలిలో నిర్మించిన మ్యాజిక్ హౌస్ లో అమ్మకు ఆ బిడ్డా ఓ చిన్న ఆలయాన్ని నిర్మించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడు. ఈ ఆలయాన్ని అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ప్రారంభించారు. వేకువ జామునే అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమిదలను పెట్టి కార్తీకమాసం సందర్భంగా మ్యాజిక్ ఫ్యామిలీ వెలిగించింది. అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను విడుదల చేశారు. తన చిన్నప్పుడు కట్టుబట్టలతో ర్యాలి గ్రామానికి అమ్మతో వచ్చానని నేడు తన ఉన్నతితో పాటు తన పిల్లల యొక్క ఉన్నతికి కూడా అమ్మ పెంచిన పెంపకమే కారణమని శ్యామ్ తెలిపారు. కోవిడ్ సమయంలో తన తల్లితో కలిసి వేలాదిమంది ఆకలి తీర్చడంతో పాటు ఎంతోమందిని కోవిడ్ బారినుండి రక్షించగలిగామని అదే స్ఫూర్తితో అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా పేదల ఆకలి తీర్చడంతో పాటు విద్యా, వైద్య సేవలను చేస్తున్నారు. అమ్మ యొక్క సేవ పూర్తిగా శాశ్వతంగా ఉండాలని ఉద్దేశంతో చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్యం అమ్మ సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో దేవాలయం నిర్మించినట్టు శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు డాక్టర్ మోహిత్ – సీత, అన్నపూర్ణ – శ్యామ్, తేజశ్రీ శ్రీకాంత్, రుషిత్, జాన్విక, డాక్టర్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు.